Breaking News

విద్యార్థినులకు బంపర్​ ఆఫర్

విద్యార్థులకు బంపర్​ ఆఫర్​

చంఢీఘర్​: పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్​ఆఫర్​ ప్రకటించారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్​ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్​ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్​ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్​ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.