ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్లో తమ క్యాంపస్లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) కంట్రోల్ చేయనున్నది. కాగా విదేశీ వర్సిటీలకు అనుమతి ఇవ్వడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పేదలకు విద్యను దూరం చేసేందుకే కేంద్రప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించాయి.
- July 30, 2020
- Archive
- Top News
- జాతీయం
- GOVERNMENT
- INDIA
- PERMITED
- UNIVERSITIES
- క్యాబినేట్
- విదేశీ వర్సిటీలు
- Comments Off on విదేశీవర్సిటీలకు అనుమతి