చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్ చేయుంచనున్నట్టు టాక్. ఇందుకోసం ఆయన ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే కమల్‌హాసన్ ఓ పార్టీని స్థాపించారు. రజనీకాంత్కూడా రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
- August 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- CHENNAI
- POLITICAL ENTRY
- TAMILNADU
- VIJAY
- తమిళనాడు
- తళపతి
- రాజకీయపార్టీ
- విజయ్
- Comments Off on విజయ్ కొత్తపార్టీ.. తమిళనాట సంచలనం