Breaking News

విజయ్​సేతుపతితో స్వీటీ రొమాన్స్​

విజయ్​ సేతుపతితో స్వీటీ

అందాల భామ అనుష్కశెట్టి (స్వీటీ).. విలక్షణ నటుడు విజయ్​ సేతుపతితో ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. విజయ్​ సేతుపతి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కాగా దర్శకుడు ఏఎల్ విజయ్​ చెప్పిన ఓ కథ విజయ్​కు తెగ నచ్చేసిందట. దీంతో ఈ చిత్రానికి ఒప్పకున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్​గా నటించబోతుందట. అనుష్క గెటప్​ ఈ చిత్రంలో చాలా కొత్తగా ఉండనున్నదని సమాచారం. చిరంజీవి సైరా మూవీ లో అద్భుతమైన పాత్రలో నటించి విజయ్​ సేతుపతి ఆకట్టుకున్నాడు. గ‌తంలో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం నాన్నలో అనుష్క కీల‌క పాత్రలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ప‌రిచ‌యంతో అనుష్క ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకుంటుంద‌ని డైరెక్టర్‌ విజ‌య్ భావిస్తున్నాడు.