నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కదా మీరు కూడా చేసే అవకాశం ఉందా’ అని సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు లేదు అన్నట్లు తలఊపిన బాలయ్య.. ‘చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్’ అన్నారు. అంతేకాకుండా ‘గతంలో కొన్ని సినిమాలు చేదు అనుభవం మిగిల్చింది. అందుకే మోహమాటం లేకుండా నటించనని చెబుతున్నా. నేను ఏదైనా అభిప్రాయాన్ని చెప్పానంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. కొన్ని కథలు నచ్చి కొందరు హీరోలకు కాల్ చేస్తే సమాధానం చెప్పలేదు. నాకు అలా కొన్ని అసంతృప్తిని కలిగించాయి. అందుకే నేను అలాంటి వారితో మాట్లాడటం మానేస్తాను.. వారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వను.. నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కానివాళ్లు ఫంక్షన్స్ కు, బిజినెస్ ఈవెంట్స్ కు ఆహ్వానించను. అప్పుడు నేను వెళ్లలేదు’ అంటూ చెప్పారు బాలయ్య.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానుల కోసం మీరు కలిసి నటించే అవకాశం ఉందా అని అడిగితే.. ‘మంచి కథ కుదిరితే కచ్చితంగా మల్టీస్టారర్ సినిమా చేస్తాం.. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలకు సంబంధించి కథను చెప్పారు. నాకంతగా నచ్చలేదు. గతంలో నాన్నగారు ఏఎన్నాఆర్ కలిసి ఎన్నో చిత్రాలు నటించారు. కానీ వాటిలో చాలా సినిమాలు నిరాశను కలిగించాయి. మల్టీస్టారర్ అంటే ‘షోలే’ సినిమా అంత భారీగా బ్రహ్మాండంగా ఉండాలి.. స్టోరీ కుదరాలి’’ అని బాలకృష్ణ అన్నారు. కాగా, ఇప్పుడు బాలయ్య అడిగినా కూడా సినిమా రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బాలయ్య గతేడాది సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవడు సుమంత్.. చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి.. హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటించారు. ఈ క్రమంలో ఈ సినిమాలో కొన్ని నిజజీవిత పాత్రల కోసం ఇండస్ట్రీలోని ఫేమస్ యాక్టర్స్ ను బాలయ్య సంప్రదించారట. అయితే వారు ఈ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదని.. అదే విషయాన్ని బాలయ్య ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమా తర్వాత వేరే హీరోలతో నటించే స్కోప్ ఉన్న సినిమాల్లో నటించలేదు బాలయ్య. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రమే వేరే స్టార్స్ నటించారు. అప్పుడే బాలయ్య ఈ సినిమా కోసమే వారిని సంప్రదించగా వారు రిజెక్ట్ చేయడంతో బాలయ్య వారిపై గుర్రుగా ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. అందుకే బాలయ్య అంత సూటిగా వారితో మాట్లాడేది లేదు.. రెస్పెక్ట్ ఇచ్చేది లేదని చెప్పేశాడు. కాకపోతే మంచి కథ దొరికితే ఎన్టీఆర్, బాలయ్య నటించే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా అర్థమయింది.
- June 3, 2020
- సినిమా
- BALAKRISHNA
- NTR
- కళ్యాణ్ రామ్
- బాలకృష్ణ
- మల్టీస్టారర్
- Comments Off on వారితో మాట్లాడను.. రెస్పెక్ట్ ఇవ్వను