సారథిన్యూస్, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి చూపించాలని కోరారు.
- July 25, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- CARONA
- KAMMAM
- MASKS
- గిరిజనులు
- బీజేపీ
- Comments Off on వలస గిరిజనులను ఆదుకోండి