సారథి న్యూస్, శ్రీశైలం/కర్నూలు: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసిద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాటు వేశారని, అందుకు వలంటీర్ల వ్యవస్థను నిదర్శంగా భావించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించకుని సున్నిపెంటలోని గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిపుత్రులకు భూమి హక్కు కల్పించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమిహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో 1.53 లక్షల మంది గిరిజన రైతులకు 3.12లక్షల ఎకరాల భూమి పత్రాలను పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, జేసీ–3 (సంక్షేమం) సయ్యద్ ఖాజామొహిద్దీన్, ఐటీడీఏ పీవో రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాంధీకి ఘననివాళి
జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గాన్ని మనమంతా అనుసరించాలని జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని గాంధీజీ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, డీఆర్‌వో పుల్లయ్య, కర్నూు నగర పాక సంస్థ అడిషనల్ కమిషనర్ నివాళులర్పించారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘బాలికలను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం, బేటి బచావో.. బేటి పడావో’ స్టిక్కర్లను ఆవిష్కరించారు.