సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో రైతులు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన సివిల్ సప్లయీస్ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్ ప్రశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ అకాలవర్షంతో అల్లాడుతున్న రైతులపై లేదన్నారు. కనీసం రైతులకు భరోసా కల్పించే సమయం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.
- October 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BATHUKAMMA
- GANGULA
- KARIMNAGAR
- MP BANDI SANJAY
- ఎంపీ బండి సంజయ్
- కరీంనగర్
- బతుకమ్మ చీరలు
- మంత్రి గంగుల
- Comments Off on వర్షాలు కురుస్తున్నయ్.. మంత్రి, ఎంపీ ఎక్కడ?