సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఇదొకటి. వివాదాస్పద అంశాలే కథనంగా ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ప్లాట్ఫామ్క్రియేట్ చేసి వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలను విడుదల చేసిన వర్మ మర్డర్, థ్రిల్లర్ మూవీస్‌ను రిలీజ్ కు రెడీచేశారు. వీటితో పాటు ఫిక్షనల్ రియాలిటీ అనే కొత్త జోనర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆర్జీవీ మిస్సింగ్, అల్లు అనే సినిమాలను ప్రకటించారు. ఈ క్రమంలో నా కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అంటూ ‘డేంజరస్’ అనే మూవీని ప్రకటించారు.
కాగా, ఆర్జీవీ అప్సరరాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ‘డేంజరస్’ చిత్రం ఓ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రకటించారు. దీనికి ‘వారి ఎఫైర్ కాప్స్, గ్యాంగ్ స్టర్స్ తో సహా చాలా మందిని చంపింది’ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ‘డేంజరస్’ అనేది అప్సరరాణి, నైనా గంగూలీ అనే ఇద్దరు మహిళల మధ్య జరిగే హై ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని వెల్లడించారు. అంతేకాకుండా ఇది ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు. తాజాగా ‘డేంజరస్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ. ‘హానరబుల్ సుప్రీంకోర్టు సెక్షన్ 377ను రద్దుచేసిన తర్వాత ఎలిజిబిలిటి ఎలివేట్ చేయడానికి ఇండియాలో రూపొందిస్తున్న ఫస్ట్ సినిమా ‘డేంజరస్’. న్యూ ఏజ్ ఇండియన్ సినిమాకు మార్గదర్శకత్వం వహించిన అప్సరరాణి, నైనా గంగూలీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని వర్మ ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో అప్సర రాణి, నైనా గంగూలీలు లిప్ లాక్ తో కనిపిస్తున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఎవరూ ఊహించని కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు