Breaking News

దోమపోటును తరిమేద్దామిలా..

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వాతవరణ పరిస్థితుల్లో వరిపంటకు దోమపోటు, ఆకు ఎండుతెగులును గమనించామని మెదక్​ జిల్లా నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. వీటిని నివారిస్తే వరిలో అధికదిగుబడి సాధించవచ్చని చెప్పారు. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 100 గ్రామ్, లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ , 600 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒక ఎకరంలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇక అగ్గితెగులు నివారణకు ట్రైసాక్లోజల్ 120 గ్రామ్ లేదా ఐసోప్రాథయోలిన్ 350 ఎం ఎల్ ను లీటర్​నీటికి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతిని బట్టి వారంలో రెండుసార్లు ఈ మందులను వాడాలన్నారు.