Breaking News

వరవరరావును విడుదల చేయాలి

సారథిన్యూస్​, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్​ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, మదన కుమారస్వామి, మాదాసు రామ్మూర్తి, యాకయ్య, గుమ్మడి కుమారస్వామి, విశ్వనాథ్, వడ్డెపల్లి శంకర్, గౌతమ్ గోవర్ధన్. నరేశ్​, సుదర్శన్, మంతెన లింగయ్య. రాస పెళ్లి రవికుమార్, పుల్ల సుచరిత, శనిగరపు రామస్వామి, పోగుల రంగయ్య. ఉప్పులేటి పర్వతాలు, నారాయణ, నరసింహారావు. శశిభూషణ్, అక్బర్, రమేశ్​, రవి. రామస్వామి, రాజేందర్, శ్రీనివాస్. గంటయ్య, కాంపల్లి స్వామి, హనుమంతు, దశరథం, మల్లయ్య, వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.