Breaking News

వరంగల్లు అద్దంలా మెరవాలే

వరంగల్లు అద్దంలా మెరవాలే

సారథి న్యూస్, వరంగల్లు: వరంగల్లులో ప్రతి డివిజన్ సర్వాంగసుందరంగా కనిపించాలని, నగరం అద్దంలా మెరిసేలా సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారులు అభివృద్ధిలో రాజీ పడొద్దని ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండని సూచించారు. ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు ఆఫీసులో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమావేశంలో వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్​ రావు, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కమిషనర్ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.