Breaking News

వచ్చేస్తున్నాయి కిసాన్‌ రైళ్లు

వచ్చేస్తున్నాయి కిసాన్‌ రైళ్లు

ముంబై: పంటను తక్కువ టైంలో, చౌకగా రవాణా చేయాలనుకుంటాడు రైతు. అందుకు కిసాన్‌ రైలు బాటలు వేయనుంది. శుక్రవారం మహారాష్ట్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలి కిసాన్‌ రైలును ప్రారంభిచారు.  రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బయల్దేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బిహార్‌లోని దానాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రోడ్డు రవాణా సమయంతో పోల్చుకుంటే 15 గంటలు తక్కువ. ఈ రైలుతో టన్నుకు రూ.1000 వరకు రైతుకు ఆదా కానుంది. ఈ రైలు ఆగే 14 స్టేషన్లలో ఏ స్టేషన్‌ నుంచైనా రైతు తన ఉత్పత్తిని నేరుగా రవాణా చేసుకోవచ్చు. త్వరలో దేశంలోని  వివిధ ప్రాంతాల నుంచి కిసాన్‌ రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌,  మే లో విజయవాడ, విజయనగరం నుంచి దిల్లీకి మామిడిపళ్ల రైలు నడవనుంది.