Breaking News

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరానికి సమీపంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వాగులు, వంకలను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఆరువేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరిందన్నారు. హంద్రీనీవా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని, సమీప గ్రామాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరించారు. ఎస్పీ వెంట ట్రైనీ డీఎస్పీ భవ్యకిశోర్, గోనెగండ్ల ఎస్సై హనుమంతరెడ్డి, ఆదోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కరరెడ్డి, ప్రాజెక్టు జేఈ రవిప్రసాద్, కోడుమూరు జేఈ పరమేశ్వర్లు పాల్గొన్నారు.