Breaking News

లుక్ మార్చేశాడు..

లుక్ మార్చేశాడు

సినిమాల్లో క్యారెక్టర్ల కోసం హీరో హీరోయిన్లు ఫుల్లుగా మేకోవర్ అయిపోవడం ఎక్కువైపోయింది. ఇంకా లుక్ మార్చడం లేదేంటా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త లుక్​ షాకిచ్చాడు విశ్వక్సేన్. ‘ఫలక్ నుమా దాస్’ మూవీతో ప్రేక్షక అభిమానం సంపాదించుకున్న విశ్వక్ నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో ‘హిట్’ సినిమా లీడ్ రోల్ తో హిట్ దక్కించుకున్నాడు. ఆ కిక్ దిగకుండా వెంటనే విశ్వక్ నరేష్ కొప్పలి కొత్త దర్శకుడితో ‘పాగల్’ మూవీకి కమిట్​మెంట్​ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ‘పాగల్’ సినిమా కోసం తన లుక్ మార్చేసిన విశ్వక్ స్టిల్స్ బయటకు వచ్చాయి. దీంట్లో హెయిర్ స్టైల్ చేంజ్ చేసి స్మార్ట్ గా తయారయ్యాడు. అంతేకాకుండా నోట్లో బీడీతో మాస్ కా దాస్ లా కనిపిస్తున్నాడు. విశ్వక్ సేన్ ‘హిట్’కు ఫొటోగ్రఫీ అందించిన మణికందన్ ఈ సినిమాకు పనిచేస్తుండగా.. గ్యారీ సర్ ఎడిటర్ గా పనిచేస్తుండగా.. రథన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.