జార్ఖండ్: లిక్కర్ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన దాదాపు 42 మందిని క్వారంటైన్‌లోకి పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేశ్ గోపాల్ చెప్పారు. ఐదురోజుల తర్వాత పోలీసుల శాంపిల్లు టెస్టులకు పంపిస్తామని చెప్పారు. ఈ పోలీసులు జైనగర్, చంద్వారా పోలీస్‌స్టేషన్‌కు చెందిన వారు.