Breaking News

లాక్​ డౌన్​ మరోసారి..

  • పెరుగుతున్న కరోనా కేసులే కారణం

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. నాలుగో దశ లాక్​ డౌన్ లో భాగంగా కొన్నింటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.4లక్షల కేసులకు చేరుకున్నాయి. దీనితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

మహారాష్ట్రలో అయితే 52వేల కేసులకు చేరాయి. తాజాగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా జూన్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. వారి బాటలోనే జూన్​ నుంచి లాక్​ డౌన్​ను అమలు చేస్తే బాగుంటుందని ఆయా రాష్ట్రాలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.