Breaking News

‘లవ్ స్టోరీ’ కంప్లీట్

‘లవ్ స్టోరీ’ కంప్లీట్


అందమైన ప్రేమకథలను ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని తెలుపుతూ అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి మొదలవగానే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రానికి నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. సీహెచ్ పవన్ సంగీతం సమకూర్చారు.