Breaking News

లవ్.. రొమాంటిక్​లో మిల్క్​బ్యూటీ

టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్​లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్​తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్​ ఫుల్​ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా రొమాంటిక్ లవర్ గా కనిపించనుందట. కాగా హీరోగా సత్యదేవ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై భావన రవి నిర్మాతగా తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ మిడిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్రానికి కాలభైరవ బ్యాక్​డ్రాప్​ అందిస్తుండగా.. సత్యహెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.