Breaking News

లక్ అలా వచ్చింది..

లక్ అలా వచ్చింది..


‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తర్వాత రాశీఖన్నా చేతిలో ఒక తెలుగు సినిమా కూడా లేదు. దీనికి తోడు కరోనా ప్రభావంతో ఎక్కడి షూటింగ్​లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో బీజీగా ఉండే సెలబ్రెటిస్ సైతం ఇంటికే పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ నెమ్మది నెమ్మదిగా ఒక్కో చిత్రం ట్రాక్ ఎక్కుతోంది. ఆల్​రెడీ కమిటై ఉన్నవాళ్లు షూటింగ్స్ కు అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాశీకి కోలీవుడ్​లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్ దర్బార్’ మూవీ ఆఫర్ వచ్చింది. అయితే కరోనా కంటే ముందే ఈ సినిమా అనౌన్స్ చేయడం, అదితీరావు హైదరీని హీరోయిన్​గా ఎంచుకోవడం.. మూవీ చిత్రీకరణ కూడా కొంత భాగం పూర్తయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చేందుకు టీమ్ రెడీ అవుతున్నప్పుడు అదితీరావు సడెన్​గా ఈ మూవీ నుంచి డేట్స్​ కుదరక తప్పుకుందట. అయితే అది రాశీకి కలిసొచ్చింది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్​లో ‘సంగ తమిళన్’ మూవీ వచ్చింది. అయితే రాశీ ఇందులో డి గ్లామర్ రోల్ లో కనిపించనుందట. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. రాశీతో పాటు ఈ చిత్రంలో మంజిమా మోహన్ కూడా నటిస్తోంది. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్​దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తన క్యారెక్టర్ గురించి చెబుతూ రాశీ..‘ఈ చిత్రంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది..” అని తన సంతోషం వ్యక్తం చేసింది.