త్వరలోనే‘ పుష్ప’ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పక్కా మాస్ మ్యాన్‌గా చూపించనున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. పల్లెటూరి పెద్దగా కనిపించే ఆ రోల్ కు మొదట తమిళ నటుడు ఆదిని అనుకున్నారు. కానీ ఇప్పుడో టాలీవుడ్ హీరోను తీసుకుంటున్నట్టుగా సమాచారం. అంచనాలకు అందని విధంగా నారా రోహిత్ పేరు వినిపిస్తోంది. అవునో కాదో మాత్రం అఫీషియల్ అనౌన్స్ ఇంకా రాలేదు.
ఏ క్యారెక్టరైనా చాలెంజ్ గా తీసుకునే రోహిత్ పాత్రలో మెప్పస్తాడనేందుకు ఏ మాత్రం సదేహం లేదు. అయినా డిఫరెంట్ కాన్సెప్ట్ లనే ఎంచుకునే నారా రోహిత్ మల్టీ హీరోల చిత్రాల్లో నటించేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తనకంటూ ఓ ఇమేజ్ ఉన్నా.. అది తన ఇగోకు అంటనివ్వడు. ‘జో అచ్చుతానంద’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’ వంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఆల్రెడీ బన్నీ సినిమాల్లో నవదీప్, శివ బాలాజీ, సుశాంత్ వంటి హీరోలు నటించి మంచి క్రెడిట్ దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా బన్నీయే స్వయంగా రోహిత్ పేరు సజెస్ట్ చేశాడని.. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని అందుకే రోహిత్ పేరు సూచించాడని తెలుస్తోంది.