సారథి న్యూస్, సిద్దిపేట: మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ వీధిలో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగీ, చికున్‌గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమవుతున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని అవగాహన కల్పించారు.
- July 26, 2020
- Archive
- Top News
- మెదక్
- షార్ట్ న్యూస్
- DRYDAY
- HARISHRAO
- SEASONAL DISEASES
- డ్రై డే
- మంత్రి హరీశ్‌రావు
- సిద్దిపేట
- Comments Off on రోగాలొస్తయ్.. జాగ్రత్త