Breaking News

రైలుబండి వచ్చేస్తోంది

– నేడు రైళ్ల టికెట్ బుకింగ్ ప్రారంభం
సారథి న్యూస్, హైదరాబాద్​: మే 17 వరకు ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వేశాఖ తాజాగా నిర్ణయం మార్చుకుంది. మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు వెళ్తాయి. వీటికి ఈనెల 11 సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్​సీటీసీలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇవీ కీలక పాయింట్లు

  • స్పెషల్ ట్రైన్లకు టికెట్ బుకింగ్ ఐఆర్​సీటీసీ ద్వారా మాత్రమే ఉంటుంది.
  • మే 11 సాయంత్రం 4 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు
  • రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు అమ్మరు. ప్లాట్‌ఫాం టికెట్లు కూడా అమ్మరు.
    ప్రయాణికులు ఏం చేయాలి
  • టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణికులు గంట ముందే స్టేషన్‌కు రావాలి.
  • స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులకు థెర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహిస్తారు.
  • ప్రయాణికులు ఏం చెయ్యాలో, చెయ్యకూడదో టికెట్లపై రాసి ఉంటుంది. తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.
  • ప్రయాణికులు తమ మొబైళ్లలో తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి. లొకేషన్, బ్లూ టూత్ ఆప్షన్ కచ్చితంగా ఆన్ ఉంచాలి.
  • ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
    ప్రయాణికులు ఏం చేయకూడదు
  • కన్‌ఫాం టికెట్ ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది.
  • కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే ట్రైన్ ఎక్కనిస్తారు.