సారథి న్యూస్, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ రైతును రాజుగా, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైతువేదిక భవనం, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం భవనాలను మంత్రి మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని వివరించారు. డిసెంబర్28 నుంచి రూ.7,300 కోట్ల రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే పెద్దకర్మ లోపు రూ.ఐదు లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, పీఏసీఎస్ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- December 26, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- KALEESHWARAM
- MAHABUBABAD
- MALOTH KAVITHA
- SATYAVATHIRATHOD
- Comments Off on రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి