సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల రామకృష్ణ, గ్రామ కార్యదర్శి సుజీవన్ రెడ్డి, కొత్తకోట నాగిరెడ్డి, వెంకటయ్య ఉన్నారు.
- October 27, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- NAGARKURNOOL
- RYTHUVEDIKA
- TELANAGNA
- తెలంగాణ
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- రైతు వేదికలు
- Comments Off on రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..