Breaking News

రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ.మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశారు. రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు, వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను రూ.1100 కోట్లు, రైతులకు ఎక్స్ గ్రేషియో కు రూ.20 కోట్లు, రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు, ప్రకృతి విపత్తు నిధి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.4,450 కోట్లు, వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.