సారథి న్యూస్,పెద్దపల్లి: రెవెన్యూ అధికారుల తన భూమిని రికార్డుల్లో ఎక్కించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటుచేసుకున్నది. తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయవలసిందిగా వీణవంక మండలం రెడ్డిపల్లికు చెందిన మందల రాజారెడ్డి అనే రైతు కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోకపోవంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
- June 20, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- FARMER
- REVENUE
- TELANGANA
- పెద్దపల్లి
- రాజారెడ్డి
- Comments Off on రైతు బలవన్మరణం