సారథిన్యూస్, మధిర: కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాంను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ..కేసీఆర్ గారు ఆలోచించిన విధంగా ఇప్పటి వరకు ఎవరు ఆలోచించలేదన్నారు.
అన్నం పెట్టే రైతు అప్పులలో ఉండొద్దన్నది తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అందుకే కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ రైతుబంధు నిధులు విడుదల చేసి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యాన్ని చాటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, జెడ్పీ సీఈవో ప్రియాంక, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా, ఎంపీపీ లలిత, సర్పంచ్ కనక పూడి పెద్ద బుచ్చయ్య, మాజీ సర్పంచ్ చావ వేణుబాబు, కోన నరేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి, టీఆర్ఎస్ పార్టీ మధిర మండల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.