Breaking News

రైతుల పోరాటానికి టీఆర్​ఎస్​ మద్దతు

రైతుల పోరాటానికి టీఆర్​ఎస్​ మద్దతు

సారథి న్యూస్, హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని గత కొద్దిరోజులుగా దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటానికి టీఆర్ఎస్ ​మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8న రైతులు చేపట్టిన భారత్ ​బంద్​కు సహకరించాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని హైవేలపైకి వచ్చి నిరసన తెలుపుతామని అన్నారు. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పార్లమెంట్ లో టీఆర్ఎస్ ​ఎంపీలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతుల ధర్నాలు చేస్తుండడం సీఎం కేసీఆర్​ హృదయాన్ని ద్రవింపజేసిందన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.