సారథి న్యూస్, రామయంపేట: రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు పీఏసీఎస్సొసైటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేటలో సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. గతంలో సొసైటీల పనితీరు ఎవరికి తెలిసేది కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వాటికి ఒక రూపు వచ్చిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అలాట్ చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. పీహెచ్సీని ఏర్పాటుచేసేందుకు సీఎం కేసీఆర్ సమ్మతించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ సిద్ధరాములు, జడ్పీటీసీ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ ఇందిర, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్ ఉన్నారు.
- September 13, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DEVENDAR REDDY
- IFCO
- MLA
- PACS
- PADMA
- RAMAYAMPET
- ఇఫ్కో
- పద్మాదేవేందర్ రెడ్డి
- పీఏసీఎస్
- రామాయంపేట
- Comments Off on రైతులకు చేదోడు వాదోడుగా సొసైటీలు