Breaking News

రైతాంగాన్ని ఆదుకోవాలి

రైతాంగాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, ఖ‌మ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భ‌ట్టి విక్రమార్క విమర్శించారు. సీఎల్పీ సార‌థ్యంలోనూ ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తికి వెళ్తున్నట్లు భట్టి చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈనెల 11న ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్​రావు, ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు మ‌హ్మద్​జావేద్‌, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టును ఎవ‌రూ సందర్శించ‌కుండా పెద్దఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. కల్వకుర్తి లిఫ్ట్​ఏమైనా నిషేధిత ప్రాంతామా? అని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​చేశారు. సన్నవడ్లకు మద్దతు ధర రూ.2500 ఇవ్వాలని భట్టి డిమాండ్​చేశారు. అకాలవ‌ర్షానికి ప‌త్తి పంట మొత్తం నాశ‌నమైందని, వారిని కూడా ఆదుకోవాల‌ని కోరారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్​చేశారు.