సారథి న్యూస్, హుస్నాబాద్: పేదల కోసం పంపిణీ చేయాల్సిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎల్లమ్మ బజార్ కాలనీలో గౌరిశెట్టి నర్సయ్య అనే వ్యక్తి తన ఇంట్లో రేషన్‌బియ్యం నిలువచేశాడు. సమాచారమందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నర్సయ్య ఇంట్లో తనిఖీ చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు.
- June 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- KARIMNAGAR
- POLICE RIDE
- RATION RICE
- Comments Off on రేషన్ బియ్యం పట్టివేత