సారథిన్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.36.36 కోట్ల కమీషన్ విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున కమీషన్ చెల్లించింది సర్కార్. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో కమీషన్ జమ కానున్నదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
- June 27, 2020
- Archive
- తెలంగాణ
- DEALRS
- RATION
- SRINIVASREDDY
- డీలర్లు
- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
- Comments Off on రేషన్ డీలర్లకు గుడ్న్యూస్