Breaking News

రెమ్యునరేషన్ తగ్గించను

రెమ్యునరేషన్ తగ్గించను


‘మోసగాళ్లు, ముంబైసాగా, హే సినామికా, ఇండియన్‌ 2, పారిస్‌ పారిస్‌’ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది కాజల్ అగర్వాల్. కరోనా కారణంగా చాలా మంది హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కానీ కాజోల్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘‘సినిమా అనేది ఛారిటీ కాదు.. పక్కా వ్యాపారం. అలాంటప్పుడు నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవరూ తమ సంపాదనని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నా వరకు నేను, నానొక మంచి పాత్ర వచ్చి, అది కష్టంగా ఉంటుందనిపించినప్పుడు పారితోషికం విషయంలో బాగానే డిమాండ్‌ చేస్తా. కష్టపడి పని చేసినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కాల్సిందే..’’ అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌.

ఇలా అంటోంది కదా అని కాజోల్ చారిటీలకు దూరం అనుకుంటే పొరపాటే. పారితోషికం అందుకున్నాక కాజోల్ మొదట ఖర్చు చారీటలదే. అరకు ప్రాంతంలో గిరిజనుల కోసం ఓ స్కూలు నడిపిస్తోంది. కుదిరిన ప్రతిసారీ అక్కడికెళ్లి పిల్లల బాగోగులు కూడా చూసి వస్తుంది. అవేమీ బయటకు తెలియనివ్వని కాజల్ నేను అది చేసాను.. ఇది చేసాను అని డబ్బా కొట్టుకోవడం నాకు నచ్చని పని. నేను నా రెమ్యునరేషన్ విషయంలో క్లారిటీగా ఉండే మాట నిజమే.. అలా అని డబ్బుకోసం వచ్చే ప్రతి చెత్త సినిమా ఒప్పుకోను అంటూ తెలిపింది కాజల్.