Breaking News

రెండు నెలల్లో ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్​

రెండు నెలల్లో ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్​

సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. హైదరాబాద్- బెంగళూరు రహదారిలో అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, జేసీ రవిపట్టన్ షెట్టి, ఎస్పీ ఫక్కీరప్ప, డీఎఫ్ వో శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్​ జి.వీరపాండియన్​