సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్‌శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ చేశారు. ఇటీవల పవర్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌తో మాట్లాడించారు. రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా పరిహారం ప్రకటించడం సరికాదన్నారు. డీఈ, ఏఈలు అని చూడకుండా అందరికీ ఒకే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుని విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో ధైర్యం నింపాలని కోరారు. కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, బీఎంఎస్ జిల్లా నాయకులు గొర్రె వేణుగోపాల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలిశెట్టి వెంకటేశ్, బీజేపీ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మానుపురి ప్రభాకర్, కొత్తగూడెం పట్టణాధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, పాటిబండ్ల అభినవ్, బానోత్ వీరన్న, బాబురావు, కొండపల్లి నాగయ్య ఉన్నారు.
- August 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BANDISANJAY
- GENCO
- KISHANREDDY
- PALWANCHA
- POWERHOUSE
- SRISAILAM
- జెన్కో
- పాల్వంచ
- శ్రీశైలం పవర్‌హౌస్
- Comments Off on రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి