న్యూఢిల్లీ: బీజేపీ లీడర్ కపిల్ శర్మ మద్దతుదారులు యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళన జరుగుతున్న ప్లేస్‌లో స్టేజ్‌కు నిప్పుపెట్టారని రూమర్ స్ర్పెడ్ అవడంతో ఢిల్లీలో గొడవలు చేలరేగాయని పోలీసులు అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ గొడవల్లో ఓ కానిస్టేబుల్ చనిపోయిన ఘటనపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చార్జ్‌షీట్ తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు.
‘చాంద్‌బాగ్‌లో కపిల్‌మిశ్రా మద్దతుదారులు నిప్పుపెట్టారని చెప్పడంతో ప్రొటెస్టర్లు దాడికి పాల్పడ్డారు. కానీ అక్కడ ఏం జరగలేదు’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పారని, పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు. కావాలనే అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లు తెలుస్తోందన్నారు. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేందర్ చాంద్ బాగ్‌లో కేవలం స్పీచ్ ఇచ్చారని, దీంతో ఆయన పేరును నిందితుల్లో చేర్చకుండా చార్జ్‌షీట్ ప్రిపేర్ చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనల్లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రతన్‌లాల్ చనిపోయారు. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ టైంలో జరిగిన గొడవల్లో దాదాపు 50 మంది చనిపోయారు.