సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్‌రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో రఘునందన్‌రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్పార్టీలో కీలకంగా పనిచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, మెదక్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్ఎస్లో జరిగిన అంతర్గత కుమ్ములాటల కారణంగా 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రఘునందన్‌రావు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2019 మెదక్ పార్లమెంట్‌నుంచి పోటీచేసి ఓడిపోయారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో 1,470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ రావు విజయం సాధించారు.
- November 10, 2020
- Top News
- మెదక్
- BJP
- DUBBAKA
- medak
- RAGHUNANDANRAO
- SOLIPETA
- SUJATHA
- దుబ్బాక
- బీజేపీ
- మెదక్
- రఘునందన్‌రావు
- సోలిపేట రామలింగారెడ్డి
- Comments Off on రిపోర్టర్ నుంచి ఎమ్మెల్యే దాకా..