రమేశ్‌వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న చిత్రంలో రాశీఖన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశీ ఓ రేంజ్లో అందాలను ఆరబోయనున్నట్టు ఫిలింనగర్ టాక్. రవితేజ ‘క్రాక్’ తర్వాత ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు.
- July 7, 2020
- Archive
- సినిమా
- NEWMOVIE
- RASHI
- RAVITEJA
- ROMANTIC
- రమేశ్‌వర్మ
- స్పెషల్ సాంగ్
- Comments Off on రాశీఖన్నా స్పెషల్‌సాంగ్