సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అయితే తాజాగా రామ్ చరణ్ తో వంశీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వంశీ రామ్ చరణ్‌కు కథ వినిపించారట. కథలోని కొత్తదనం చరణ్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మహర్షి’ తర్వాత వంశీ ఒక ప్రాజెక్టుతో మహేష్ ను సంప్రదించగా మహేష్ బాబు అంగీకరించాలేదట. ఇప్పుడో కొత్త కథతో రామ్ చరణ్‌ను అప్రోచ్ అయ్యారట వంశీ పైడిపల్లి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎవడు’ చిత్రం బ్లాక్ బ్లస్టర్అందుకుంది. ‘మహర్షి’ మేసేజ్ ఓరియెంటెడ్ చిత్రం.. మరి ఈ సినిమా ఏ బాణీలో రానుందో. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు.
- July 12, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- సినిమా
- MAHESHBABU
- RAMCHARAN
- VAMSHI
- మహేష్‌బాబు
- రామ్ చరణ్
- వంశీ పైడిపల్లి
- Comments Off on రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్