యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎంపిక చిత్రబృందం కసరత్తు చేస్తున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఆయన చేసే ప్రతిసినిమాను పాన్ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ దక్షిణాదిన ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ.. బాలీవుడ్లో భారీగా వసూళ్లు రాబట్టింది. కాగా, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడు’గా కనిపిస్తారని టాక్. సీత పాత్ర కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మొదట కీర్తీసురేశ్ పేరు వినిపించింది. కాగా ప్రస్తుతం బాలీవుడ్ భామ కియారా ఆద్వానీ సీత పాత్రలో నటించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
- August 26, 2020
- Archive
- సినిమా
- ADIPURUSH
- BOLLYWOOD
- KAIRA ADVANI
- PRABHAS
- SEETHA
- కియారా అద్వానీ
- టాలీవుడ్
- పాత్ర
- ప్రభాస్
- బాలీవుడ్
- Comments Off on రాముడిగా ప్రభాస్.. మరి సీత?