![కరోనా రామడుగు ఎమ్మార్వో](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CARONA-RAMADUGU-MROFF.jpg?fit=701%2C394&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని శిక్షణా అధికారికి కరోనా సోకింది. దీంతో ఇటీవల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. పరిసరాలను శుభ్రపరిచారు. రామడుగు మండలంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచించారు. ఇటీవల రామడుగు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వారంతా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.