కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా లారెన్స్తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది.
తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ కాంత్ పాల్గొంటారని వస్తున్న సమాచారానికి మరింత బూస్ట్ ఇచ్చాడు రాఘవ. ఆల్రెడీ కళామతల్లి ముద్దుబిడ్డ అయిన కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయమ్’ పార్టీని స్థాపించారు. ఇప్పుడు రాఘవ కూడా అదే బాట పట్టనున్నాడట. అయితే రాఘవకు పార్టీ స్థాపించే ఉద్దేశం లేదని, ఇప్పటి వరకూ చేసే సేవలు రాజకీయంలోకి వస్తే మరింత విస్తృతపరిచేందుకు వీలుంటుందని రాఘవ అభిప్రాయం.
అదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ‘ఇప్పటి వరకూ నన్ను ప్రోత్సహించిన బంధువులు.. ఫ్రెండ్స్.. అంతా ఈ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా.. నా గురువు సూపర్ స్టార్ రజినీ సారే. నేను ఆయన అడుగుల్లో అడుగేయాలి అనుకుంటున్నా.. పార్టీ ప్రకటన అనంతరం ఆయన బాటలోనే నడుస్తా..’ నవంబర్‌లో రజినీ పార్టీలో చేరబోతున్నట్టు అంటూ రాఘవ చెప్పడం.. ఇటు రాజకీయాలు, అటు సినీ ఇండస్ట్రీలో హాట్‌టాఫిక్‌గా మారింది.