సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.