Breaking News

రష్యా వ్యాక్సిన్​ సేఫ్​

మాస్కో: రష్యా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్​ ‘స్పుత్నిక్​ – వీ’ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నదని.. ప్రముఖ మెడికల్​ జర్నల్​ లాన్పెట్​ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్​పై వెల్లువెత్తున్న ఆరోపణలకు చెక్​పడింది. శుక్రవారం విడుదలైన లన్సెట్​ జర్నల్​లో రష్యా వ్యాక్సిన్​పై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జూన్​​-జూలైలో రెండు దశల్లో మొత్తం 76 మందికి ఈ వ్యాక్సిన్​ ఇచ్చారని జర్నల్​లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ఏవిధమైన ఆరోగ్య సమస్య రాలేదని పేర్కొన్నారు. పైగా వ్యాక్సిన్​ సమర్థంగా పనిచేస్తున్నదని.. శరీరంలో యాంటి బాడీస్​ను ఉత్పత్తి చేసి కరోనాను అందమొందిస్తున్నదని ఈ కథనంలో పేర్కొన్నారు. రష్యా వ్యాక్సిన్​ అత్యంత సురక్షితమైనదని .. ఈ వ్యాక్సిన్​పట్ల ఎవరూ అనుమానాలు పెట్టుకొవద్దని కూడా పేర్కొన్నారు. ఈ కథనం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. తమపై తరుచూ వస్తున్న ఆరోపణలకు ఇది సరైన కౌంటర్​ అని రష్యాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అందరి కంటే ముందుగా వ్యాక్సిన్​ కనిపెట్టిన దేశంగా రష్యా రికార్డు నెలకొల్పింది. అయితే ఈ వ్యాక్సిన్​పై పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు వక్తం చేశారు. క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల సైంటిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లన్సెట్​ ప్రచురణ తమకు కొండంత ధైర్యాన్ని అందించిందని రష్యన్​ డైరెక్టర్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ అధినేత కిరిల్​ దిమిత్రియేవ్​ పేర్కొన్నారు.