Breaking News

రష్యాలో వ్యాక్సిన్​ పంపిణీ షురూ

రష్యా ప్రభుత్వం.. కరోనా వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్​ అన్ని దశల్లో విజయవంతం కావడంతో అందుబాటులోకి తెస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ‘స్పుత్నిక్​​​​- వీ’ అనే వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​పై ఇతర దేశాలకు చెందిన నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​ సత్ఫలితాలు సాధించింది. రీజియన్ల వారీగా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్​ తయారుచేసింది తామేనని గత నెల 11 న వ్లాదిమిర్​ పుతిన్​ ప్రకటించారు. తన కూతురుకు ఆయన తొలి వ్యాక్సిన్​ను ఇప్పించాడు. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ వెల్లడించింది.