హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా సెలెక్ట్ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న రష్మిక సడెన్‌గా ఓ బాలీవుడ్ అప్డేట్తో ట్విటర్లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ మల్హొత్రా హీరోగా బాలీవుడ్ కొత్త డైరెక్టర్ శాంతను బగ్ చీ రూపొందించనున్న ‘మిషన్‌మజ్ను’లో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్‌లో హీరోయిన్గా రష్మిక పేరు వినిపించినా అఫీషియల్ కన్ఫర్మేషన్ రానందున అది డౌట్‌గానే ఉండింది. ఇప్పుడు తనే స్వయంగా రివీల్చేయడంతో ఆ డౌట్కాస్త తీరిపోయింది. పాకిస్థాన్ లో భారత సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ జరిపింది. ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈస్టోరీ తెరకెక్కనుంది. ఇందులో హీరో సిద్ధార్థ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. పర్వీజ్షేక్, అసీమ్ ఆరోరా, సుమిత్ బతేజా రాసిన ఈ కథను రోనీ స్క్రూవాలా, అమర్బుటాలా, గరిమా మెహతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్లో అడుగుపెడుతున్నందుకు తెగ ఆనంద పడుతోంది రష్మిక. ఆమె నటించిన కన్నడ, తెలుగు భాషల మూవీ ‘పొగరు’ రిలీజ్ కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్లో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్గా అనుకుంటున్నారు. మొత్తానికి తెలుగు, తమిళ, కన్నడంలోనే కాకుండా ఈ మూవీతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేస్తున్న రష్మిక లక్కీ గాళే..
- December 24, 2020
- Archive
- Top News
- సినిమా
- ALLUARJUN
- BOLLYWOOD
- MISSIONMAJNU
- RASHMIKA MANDANA
- అల్లు అర్జున్
- బాలీవుడ్
- మిషన్‌మజ్ను
- రష్మిక మందాన్న
- Comments Off on రష్మిక.. లక్కీ గాళ్