కాబూల్: సన్రైజర్స్ ఆటగాడు, అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం నెలకొన్నది. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను అభిమానులతో పంచుకుంటూ రషీద్ ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు. ‘అమ్మా.. నువ్వే నా సర్వసం. ఇప్పుడు నాకు నీ అండ లేదు. నువ్వు లేకుండా నేను లేను. నువ్వు లేవనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ అత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ రషీద్ ట్వీట్ చేశాడు. అనారోగ్యం కారణంగానే 2019లో రషీద్ తన తండ్రిని కోల్పోయాడు. రషీద్ తల్లి మరణవార్తను తెలుసుకున్న సహచర క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు.
- June 20, 2020
- Archive
- క్రీడలు
- MOTHER
- RASHEED
- SUNRISERS
- రషీద్ ఖాన్
- విషాదం
- Comments Off on రషీద్ ఖాన్ తల్లి కన్నుమూత