చెన్నై: అభిమానుల ఎదురుచూపులు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలను నిజం చేస్తూ.. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. మక్కల్ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. పార్టీ గుర్తుగా సైకిల్ గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వెలువడినప్పటికీ చివరికి ఆటో గుర్తును కేటాయించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బాషా సినిమాలోని ఆటో డ్రైవర్ క్యారెక్టర్లో అభిమానులు, ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ పాత్రనే తన పొలిటికల్ కేరీర్లోనూ పోషించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- December 15, 2020
- Archive
- Top News
- జాతీయం
- BASHA CINIMA
- ELECTION COMMISSION
- MAKKALSEYKARCHIAGA
- PRAJASEVAPARTY
- RAJINIKANTH
- కేంద్ర ఎన్నికల సంఘం
- ప్రజాసేవా పార్టీ
- బాషా సినిమా
- మక్కల్ సేవై కర్చీగా
- రజనీకాంత్
- Comments Off on రజనీకాంత్ పార్టీ ఖరారు ?