స్టార్ హీరోయిన్లంతా వెబ్ గూటివైపు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ స్టర్స్ తో సమానంగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా ఇలా ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్ అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేస్తోందట. మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. కథ కూడా విని ఓకే చెప్పేసింది అంటున్నారు. ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ అని, తన ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ కథ రకుల్ కు బాగా నచ్చిందని, అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించబోతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను విక్రమ్ అనే నూతన డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అన్ని కుదిరితే అక్టోబర్ నుంచి షూట్ ప్లాన్ చేయాలని కూడా చూస్తున్నారు.
- July 22, 2020
- Archive
- సినిమా
- RAKULPREETH
- TWEENS WEB SERIES
- VIKRAM
- కాజల్
- రకుల్‌ప్రీత్‌సింగ్
- వెబ్‌సీరిస్
- Comments Off on రకుల్.. డబుల్ రోల్